- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fishermen: 34 మంది భారత మత్స్యకారుల అరెస్ట్.. వెల్లడించిన శ్రీలంక నేవీ
అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు గాను 34మంది భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు గాను 34మంది భారత మత్స్యకారులను (Indian fishermens) శ్రీలంక అరెస్ట్ చేసింది. జాలర్లకు చెందిన మూడు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. మన్నార్ జిల్లా తీరంలో ఈ నెల 25, 26 తేదీల్లో వీరందరినీ అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నేవీ తెలిపింది. మత్స్యకారులంతా ఐఎంబీఎల్‌ను ఉల్లంఘించి శ్రీలంక నీటిలో చేపలు పట్టినట్టు ఆరోపించింది. అరెస్ట్ చేసిన వారందరినీ న్యాయపరమైన విచారణ నిమిత్తం కిలినోచ్చిలోని అసిస్టెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిషరీస్‌కు అప్పగించారు. దీంతో ఈ ఏడాది శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయ మత్య్సకారుల సంఖ్య 52కు చేరుకుంది. అయితే ఎలాంటి జరిమానా లేకుండా మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కాగా, ఈ వారం ప్రారంభంలో, శ్రీలంక సముద్ర జలాల్లో చేపలు పట్టినందుకు నిర్బంధించబడిన 41 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసినట్టు భారత హైకమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అరెస్ట్‌లు జరగడం గమనార్హం.






