- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Japan : జపాన్ ప్రధానిగా తొలి మహిళ
జపాన్(Japan) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్ : జపాన్(Japan) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జపాన్ ప్రధానిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికైంది(Japan first female prime minister). లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు సనే తకైచి (Sanae Takaichi) ఎన్నికయ్యారు. కాగా పార్టీలో అంతర్గత గొడవల కారణంగా జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పార్లమెంట్ సభలో సభ్యులు సనై తకైచిని ఎన్నుకున్నారు. అయితే ఇటీవల జపాన్ లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని సాధించలేకపోయింది.
దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోగా... ఇషిబాపై ఒత్తిడి పెరిగి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ్గా.. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి మరీ... తకైచి విజయం సాధించింది. అలాగే నేడు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో.. తకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన రికార్డుసాధించారు.
64 ఏళ్ల తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. కాగా... జపాన్ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన సానే తకైచికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్‌ల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.






