మొదటిసారిగా క్రొయేషియాలో భారత ప్రధాని పర్యటన

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-18 11:36:37  IST  )

ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా జూన్ 18న క్రొయేషియాకు చేరుకున్నారు.

మొదటిసారిగా క్రొయేషియాలో భారత ప్రధాని పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ (జూన్ 18) క్రొయేషియాకు చేరుకున్నారు. భారత ప్రధాని ఈ బాల్కన్ దేశాన్ని పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జాగ్రెబ్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్ (President Zoran Milanovic), ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్‌లతో (Prime Minister Andrej Plenkovic) మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో విద్య, ఐటీ, స్టార్టప్‌లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు వంటి అంశాలపై కూడా చర్చినట్లు సమాచారం. అలాగే, భారతీయ వ్యాపారవేత్తలు, వలస జీవులతో మోదీ సమావేశమై వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.

కాగా, ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ జూన్ 15న సైప్రస్‌కు వెళ్లారు. అక్కడ ‘ఇండియా-మిడిలీ ఈస్ట్-యూరప్ కారిడార్ (IMEC)’ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చించారు. మారిటైం, రక్షణ, సైబర్ భద్రత రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు చేయడం జరిగింది. జూన్ 16న కెనడాలో జీ7 సమ్మిట్‌లో పాల్గొని, గ్లోబల్ సౌత్, వాణిజ్యం, పర్యావరణం, శాంతి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించారు. ఈ మూడు దేశాల పర్యటన ద్వారా భారతదేశం తన అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించేందుకు అడుగులు వేసింది.

Next Story