ముందు ఓటు.. ఆ తర్వాతే మిగతా ముచ్చట్లు! పెళ్లైన వెంటనే ఓటేసిన నవ దంపతులు

by Ramesh Naini |

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముమ్మరంగా కొనసాగుతోంది.

ముందు ఓటు.. ఆ తర్వాతే మిగతా ముచ్చట్లు! పెళ్లైన వెంటనే ఓటేసిన నవ దంపతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముమ్మరంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత కింద 152 స్థానాలకు, తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకేసారి ఓటింగ్ జరుగుతుండగా.. గుజరాత్‌లోని ఉమ్రెఠ్‌, మహారాష్ట్రలోని బారామతి, రాహురీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పలువురు ప్రముఖులు, సాధారణ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు.

ఈ ఎన్నికల కోలాహలంలో తమిళనాడులో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘట్టం అందరి దృష్టిని ఆకర్షించింది. తెల్లవారుజామున 4 గంటలకు వివాహ బంధంతో ఒకటైన ఎన్. రాజారామ్, వి. రేణుక అనే నవ దంపతులు.. పెళ్లైన వెంటనే నేరుగా కే పుదూర్‌లోని అల్ అమీన్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే ఉత్సాహంగా వచ్చి తమ తొలి ప్రాధాన్యతగా ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముందు ఓటు.. ఆ తర్వాతే మిగతా ముచ్చట్లు అన్నట్లుగా నవ దంపతుల తీరు ఉందని నెటిజన్‌లు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story