- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: శశి థరూర్ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ విమర్శలు
యూడీఎఫ్ అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి యూడీఎఫ్ నుంచే ఉంటారని మురళీధరన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ ఇటీవల కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నాయకులలో ముఖ్యమంత్రి పదవికి తననే ఎక్కువమంది ఇష్టపడతారనే సర్వేను సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె మురళీధరన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'ముందు ఆయన(శశి థరూర్) ఏ పార్టీకి చెందినవారో ఆయనే నిర్ణయించుకోవాలి' అని అన్నారు. సర్వేలో వేరే ఎవరైనా ముందంజలో ఉన్నప్పటికీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి యూడీఎఫ్ నుంచే ఉంటారని మురళీధరన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి తమ లక్ష్యం ఎన్నికల్లో గెలుపు సాధించడం, మరే అనవసర వివాదాలపై ఆసక్తి లేదని పేర్కొన్నారు. శశి థరూర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న బంధం క్రమంగా బలహీనపడుతోంది. కాంగ్రెస్ నేతలకు, ఆయనకు మధ్య నిరంతరం మాటలు విమర్శల స్థాయికి చేరుతున్నాయి. ఏ సర్వే ఏమి చెప్పినా, ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ కేరళ యూనిట్‌లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. పార్టీ కంటూ నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మురళీధరన్ స్పష్టం చేశారు.






