- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ఆవరణలో కాల్పులు.. మహిళ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి హల్‌చల్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం సాకేత్ కోర్టు ప్రాంగణంలోని లాయర్స్ బ్లాక్‌లో గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. లాయర్ దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఓ మహిళే టార్గెట్‌గా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియక బ్లాక్‌లోని లాయర్లు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను స్థానికంగా ఉన్నవారు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళ భర్తే కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనికి కుటుంబ తగాదాలు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.
— ANI (@ANI) April 21, 2023
(Warning: Disturbing visuals)
Visuals confirmed by police. pic.twitter.com/vdaUBqZxmp






