బాణసంచా కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

తమిళనాడు సాతూర్ లోని బాణసంచా కేంద్రంలో పేలుడు (Fire Works Explosion) సంభవించింది.

బాణసంచా కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సాతూర్ లోని బాణసంచా కేంద్రంలో పేలుడు (Fire Works Explosion) సంభవించింది. పేలుడు ధాటికి బాణసంచా కేంద్రంలో ఉన్న గదులన్నీ కుప్పకూలిపోయాయి. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

కాగా.. ఐదు రోజుల క్రితం సాతూర్ లోనే చిన్నకమన్ పట్టిలో ఉన్న బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ధాటికి ఏడు వర్కింగ్ షెడ్లు కుప్పకూలాయి. ఆ సమయంలో సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తుండగా.. 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాణసంచా తయారు చేయడంలో తమిళనాడు జిల్లాలు పెట్టింది పేరు. ఇక్కడ బాణసంచా కేంద్రాల్లో తరచూ పేలుళ్లు జరుగుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

Next Story