- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో రైలు ప్రమాదం.. స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్‍లో మంటలు
కదులుతున్న రైలులో మంటలు అంటుకోవడం కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ రైల్వేను అగ్నిప్రమాదాలు (Train Fire Accident) భయపెడుతున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో (Swarnagiri Express) మంటలు అంటుకున్నాయి. ఆదివారం ఉదయం రాజస్థాన్‍లోని జైసల్మేర్ జిల్లాలోని జేతా-చందన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ నుంచి వస్తున్న స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ కోచ్ కింద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కదులుతున్న రైలు నుంచి పొగలు, మంటలు ఎగిసిపడటం చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికుల కేకలు, దట్టంగా అలుముకున్న పొగలను చూసి అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే ట్రైన్ ను నిలిపివేశారు. అదృష్టవాశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షింతంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






