- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సింగ్‌హోమ్‌లో అగ్నిప్రమాదం.. 16 మంది సజీవ దహనం
ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనడో నగరంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. రానోముట్ సబ్ డిస్ట్రిక్ట్, పాల్ డువా ప్రాంతంలో సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక బృందాలు దాదాపు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి దాదాపు 20 కంటే ఎక్కువ మందిని రక్షించి వివిధ హాస్పిటల్‌లకు తరలించారు.
వృద్ధులు ఎక్కువగా ఉండటం, కొందరు వీల్‌చైర్లలో ఉండటంతో తప్పించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, ఇండోనేసియా పోలీసులు భయంగ్కర హాస్పిటల్‌లో మృతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఈ విషాద ఘటనపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.






