విమానంలో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Ajay Maddhiboyina |

బ్రెజిల్‌లో తృటిలో విమాన ప్ర‌మాదం త‌ప్పింది. విమానం టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా విమానంలో మంట‌లు చెల‌రేగాయి. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ప్రాయాణికుల‌ను కింద‌కు దింపేశారు.

విమానంలో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: బ్రెజిల్‌లో తృటిలో విమాన ప్ర‌మాదం త‌ప్పింది. విమానం టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా విమానంలో మంట‌లు చెల‌రేగాయి. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ప్రాయాణికుల‌ను కింద‌కు దింపేశారు. విమానం చ‌క్రాల వ‌ద్ద మంట‌లు మొద‌లై ఆ త‌ర‌వాత వ్యాపించాయి. దీంతో విమానం అంతా ద‌ట్ట‌మైన పొగ‌తో నిండిపోయింది. కొద్దిసేపు ప్ర‌యాణికులు ఏం జ‌రుగుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్క‌రి అయ్యారు. అయితే విమానం గాలిలోకి ఎగిరిన త‌ర‌వాత ప్ర‌మాదం జ‌రిగి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. గాల్లోకి ఎగిరిన త‌ర‌వాత మంట‌లు వ్యాపిస్తే ఎక్క‌డా ల్యాండ్ చేయ‌లేక ప్ర‌మాద తీవ్ర‌త ఊహించ‌ని విధంగా ఉండేది. ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మంట‌లు చెల‌రేగిన విమానాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రో విమానంలో ప్ర‌యాణికుల‌ను తీసుకువెళ్లారు. VIDEO

Next Story