Isreal wild fire: ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-28 15:56:37  IST  )

ఇజ్రాయెల్‌లో (Isreal) కార్చిచ్చు బీభత్సం (Wild fire) సృష్టిస్తోంది.

Isreal wild fire: ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్‌లో (Isreal) కార్చిచ్చు బీభత్సం (Wild fire) సృష్టిస్తోంది. జెరూసలెం (Jerusalem) శిరవారుల్లోని అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పొడి వాతావరణం, గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దాదాపు 3,000 ఎకరాల అడవులు ఇప్పటికే తగలబడ్డాయి. జెరూసలెం నుంచి తెల్ అవీవ్ ప్రధాన రహదారి వరకు మంటలు వ్యాపించటంతో ఆ దారులన్నీ అధికారులు మూసేశారు. అలాగే, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు కారణంగా 24 గంటల్లోనే కనీసం 13 మందికి గాయాలు కాగా, ఎటువంటి ప్రాణనష్టం నమోదుకాలేదు. ఈ మంటలను ఆర్పేందుకు 160కి పైగా అగ్నిమాపక బృందాలు, డజన్ల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, సైన్యం కూడా రంగంలోకి దిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ ప్రమాదం కారణంగా జెరూసలెంలో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్స వేడుకలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ ప్రమాదంపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. మంటలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంటలను అదుపుచేసేందుకు అంతర్జాతీయ సహాయం కోరగా, ఉక్రెయిన్, స్పెయిన్, ఫ్రాన్స్, రొమేనియా, క్రోయేషియా, ఇటలీ వంటి దేశాలు తమ విమానాలను పంపనున్నట్టు ప్రకటించాయి.

Click For Video..

Next Story