- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మాజీమంత్రి ఇంటిలో అగ్నిప్రమాదం
కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఇంటిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని మదర్ థెరిస్సా క్రీసెంట్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ఉదయం 8 గంటలకు మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఇంటిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని మదర్ థెరిస్సా క్రీసెంట్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ఉదయం 8 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రవిశంకర్ ప్రసాద్ ఇంట్లోనే ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన ఇంటిలో ఒక గది నుంచి మంటలు ఎగసిపడ్డాయని ఫోన్ రావడంతో మూడు ఫైరింజన్లతో వెళ్లి మంటల్ని ఆర్పినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనకు కారణమేంటన్న విషయం తెలియాల్సి ఉందని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






