పూర్ణియా స్పెషల్ రైలులో అగ్నిప్రమాదం

by Malleboina Mahesh |

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పూర్ణియా స్పెషల్ రైలు సాహిబాబాద్ స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో లగేజీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు (fires) చెలరేగాయి.

పూర్ణియా స్పెషల్ రైలులో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పూర్ణియా స్పెషల్ రైలు (Purnia Special train)లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ విహార్–పూర్ణియా స్పెషల్ రైలు సాహిబాబాద్ స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలోలగేజీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు (fires) చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది (Fire crew), రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అయితే మళ్లీ మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో సంబంధిత లగేజీ కోచ్‌ (Luggage coach)ను వేరుచేసి రైలును మళ్లీ ప్రయాణం కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా రైలులో ఆ మంటలు ఎలా చెలరేగాయనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, షార్ట్ సర్క్యూట్, సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస ఘటనలతో ఉత్తరప్రదేశ్‌లో రైళ్ల భద్రతా చర్యలపై ఇప్పుడు మరింత కసరత్తు చేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story