విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో చెలరేగిన మంటలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-20 12:36:08  IST  )

ఇటీవల కాలంలో వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజు ఎక్కడో ఓ విమానానికి సంబంధించిన అత్యవసర ల్యాండింగ్, ఇంజిన్‌లో మంటలు, టెక్నికల్ ఫేల్యూర్స్ వంటి వార్తలు వెలుగు చూస్తుండటం భద్రతపై అనేక ప్రశ్నలు కలిగిస్తోంది.

తాజాగా అమెరికాలో (America) డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 767-400 విమానం (Boeing 767-400 aircraft) గాల్లో ఉండగానే ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. లాస్‌ఏంజెలెస్‌ నుంచి అట్లాంటా (From Los Angeles to Atlanta) వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని తిరిగి మళ్లించి, లాస్‌ఏంజెలెస్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్‌వేపైకి చేరుకుని మంటలను అదుపు చేశారు.

అయితే, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఏప్రిల్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అట్లాంటాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఓర్లాండో ఎయిర్‌పోర్టులో మంటలు చెలరేగాయి. అప్పుడు కూడా సమయస్ఫూర్తితో స్పందించిన సిబ్బంది పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ఈ తరహా ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉండటంతో, విమానయాన సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story