రైలుపై వెళ్తున్న ఆర్మీ ట్రక్‌లో అగ్ని ప్రమాదం

by Malleboina Mahesh |

ఆర్మీ సిబ్బందితో పాటు, వాహనాలను తీసుకెళ్తున్న స్సెషల్ రైలులో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.

రైలుపై వెళ్తున్న ఆర్మీ ట్రక్‌లో అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్మీ సిబ్బందితో పాటు, వాహనాలను తీసుకెళ్తున్న స్సెషల్ రైలు (Special train)లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం రైలు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్ రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న సమయంలో.. రైలుపై లోడ్ చేసి ఉన్న ఆర్మీ ట్రక్‌ (Army truck)లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం (fire hazard) చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో.. రైల్వేలోని సిబ్బంది, అలాగే స్టేషన్‌లో గల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వెంటనే స్పందించి, కొద్ది సమయంలోనే అగ్ని నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. ఈ ప్రత్యేక మాల్గాడీ భోపాల్ నుంచి జోధ్పూర్ వరకు సైనికులు, ఆర్మీ ట్రక్‌లలో సరుకులు తీసుకు వెళ్ళుతూ ఉంది. ఉదయం 8:48 గంటల సమయంలో, మాల్గాడి ఉజ్జైన్ స్టేషన్ (Ujjain Station) ప్లాట్ఫారం నంబర్ 2 కు చేరిన వెంటనే ఒక ట్రక్‌లో అగ్ని ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

Next Story