Fire Accident: లాహోర్‌ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. రన్‌వే మూసివేత

by Kema Shiva Kumar |

భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Fire Accident: లాహోర్‌ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. రన్‌వే మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Lahore International Airport)లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్మీ విమానం (Army Aircraft) ల్యాండ్ అవుతుండగా ఉన్నట్టుండి ఓ టైర్ బ్లాస్ట్ అయి రన్‌వే (Runway)పై భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు స్టాఫ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ పరిణామంతో లాహోర్ (Lahore) నుంచి ఫ్లైట్ ఆపరేషన్స్ పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా ఎయిర్‌పోర్టులో విమానాలు ల్యాండ్ అవ్వకుండా రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

Next Story