- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC భవనంలో అగ్నిప్రమాదం.. మహిళా అధికారిణి మృతి
ఎల్ఐసీ భవనంలో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎల్ఐసీ భవనంలో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. స్థానిక ఎల్ఐసీ ఆఫీసులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటల్ని అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎల్ఐసీ ఆఫీసులో పనిచేస్తున్న మహిళా అధికారిణి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు గాయపడగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసేందుకు వెళ్లిన సమయంలో ఆఫీసు నుంచి మంటలు రావడం చూసినట్లు ఓ వ్యక్తి మీడియాకు తెలిపాడు. వెంటనే పైకి వెళ్లి అద్దాలను పగలగొట్టగా ఒక వ్యక్తి గాయాలతో బయటకు వచ్చాడని, వెంటనే పోలీసులు, అంబులెన్సులకు ఫోన్ చేశానని చెప్పాడు. కాగా.. ఈ ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియలేదని, దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.






