Breaking: కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-05 04:09:30  IST  )

కాన్పూర్ (Kanpur) లోని చమన్ గంజ్ (Chaman Ganj) ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.

Breaking: కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్ (Kanpur) లోని చమన్ గంజ్ (Chaman Ganj) ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అగ్నిప్రమాదం తీవ్రతను చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని కాన్పూర్ డీసీపీ దినేష్ త్రిపాఠి (DCP Dinesh Tripati) తెలిపారు.

Next Story