- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. గంటలతరబడి ఎగసిపడుతోన్న మంటలు
ఫర్నీచర్ అండ్ ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. గంటలతరబడి మంటలు ఎగసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫర్నీచర్ అండ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగగా.. నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ అంతా వ్యాపించింది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండగా.. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నా.. గంటలతరబడి మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్, చెక్క వస్తువులు కావడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారింది. కాగా.. ఈ ప్రమాద ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా? ప్రాణనష్టం జరిగిందా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






