హోటల్‌లో మహిళపై అత్యాచారం... బీజేపీ ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు..

by Sujitha Rachapalli |

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ మీద రేప్ కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడని కేసు పెట్టింది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం..

హోటల్‌లో మహిళపై అత్యాచారం... బీజేపీ ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు..
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ మీద రేప్ కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడని కేసు పెట్టింది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. ప్రతీక్ చౌహాన్‌తో రెండేళ్ల రిలేషన్ తర్వాత.. వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. సెప్టెంబర్ 2023లో ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లి.. హోటల్ గదిలో మొదటి అత్యాచారాన్ని చేశాడని ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 25, 2023 నుంచి మార్చి 27, 2024 వరకు.. పలుమార్లు బలవంతంగా లొంగదీసుకున్నాడని తెలిపింది. సెక్షన్ 63, సెక్షన్ 90 ఆధారంగా.. తప్పుడు వివాహ హామీ ద్వారా లైంగిక సంబంధాలు రేప్‌గా పరిగణించబడతాయి.

Next Story