- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యుడికి ఆర్థిక భరోసా.. PMJJBY, PMSBY పథకాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
PMJJBY, PMSBY మరియు APY పథకాలు 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటివరకు రూ. 25,160 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) మరియు అటల్ పెన్షన్ యోజన (APY) దేశవ్యాప్తంగా పౌరులకు సామాజిక భద్రతను అందించడంలో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పథకాలను అందరికీ, ముఖ్యంగా సమాజంలోని అణగారిన మరియు బలహీన వర్గాలకు అందుబాటు ధరలో ఆర్థిక రక్షణ కల్పించేందుకు రూపొందించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ PMJJBY, PMSBY వంటి జన సురక్ష పథకాలు 2015లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు రూ. 25,160 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించాయని శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గణాంకాలను వెల్లడించిన సీతారామన్.. PMJJBY కింద 27 కోట్లు, PMSBY కింద 58 కోట్లు మరియు APY కింద 9 కోట్ల కంటే ఎక్కువ నమోదులు జరిగాయని పేర్కొన్నారు. PMJJBY పథకం ద్వారా 10.7 లక్షల కుటుంబాలకు రూ. 21,500 కోట్లకు పైగా, PMSBY ద్వారా 1.84 లక్షల కుటుంబాలకు దాదాపు రూ. 3,660 కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు ఆమె వివరించారు.
డిజిటల్ క్లెయిమ్స్:
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ జన సురక్ష పోర్టల్ ప్రారంభించడం వల్ల పౌరులు బ్యాంకులు లేదా పోస్టాఫీసులకు వెళ్లకుండానే సౌకర్యవంతంగా నమోదు చేసుకునే అవకాశం కలిగిందని తెలిపారు. క్లెయిమ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం వల్ల వేగంగా పరిష్కారాలు జరుగుతున్నాయని, దీనివల్ల బాధిత కుటుంబాలకు అవసరమైన సమయంలో సకాలంలో మద్దతు అందుతోందని ఆయన పేర్కొన్నారు.






