- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగదీశ్ టైట్లర్ నేరాలపై.. అభియోగాలు నమోదు చేయండి! సీబీఐ కోర్ట్
1984 లో.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి, పుల్ బంగశ్ హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పై హత్య, ఇతర నేరాలపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: 1984 లో.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి, పుల్ బంగశ్ హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పై హత్య, ఇతర నేరాలపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియోల్ ఆదేశాలు జారీ చేశారు. జగదీష్ పై విచారణ చేపట్టేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి తెలిపారు.
దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం.. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి గతంలో ఓ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ వాంగ్మూలం లో జగదీష్ 1984 నవంబర్ 1 న తెలుపు రంగులో ఉన్న అంబాసిడర్ కారులోంచి దిగి, అక్కడ అల్లరి మూకలను రెచ్చగొట్టినట్లు తన వాంగ్మూలంలో తెలిపాడు. సదరు సాక్షి.. "మన తల్లిని చంపిన వారిని చంపేయండి." అంటూ సంఘటన స్థలంలో ఉన్న వారిని ప్రేరేపించారని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. అల్లర్లను ప్రేరేపించడం ద్వారా చట్టవిరుద్ధంగా గుమి గూడడడం, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, లూటీ, దురాక్రమణ వంటి అభియోగాలను జగదీష్ టైట్లర్ పై నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 13 న చేపట్టనుంది.






