- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4th క్లాసులో గొడవ.. 50 ఏళ్ల తర్వాత ప్రతీకారం
చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్(School Friends) కలిస్తే సరదాగా గడుపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్(School Friends) కలిస్తే సరదాగా గడుపుతారు. అయితే అందుకు విరుద్ధంగా ఓ వ్యక్తి తోటి స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు. అతడు ఎందుకు దాడి చేశాడో తెలుసుకొని తోటి స్నేహితులు, పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కేరళ(Kerala)లోని కాసర్ఘడ్(Kasargod) జిల్లాలో బాలకృష్ణన్, వీజే బాబులు 50 ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలలో కలిసి చదువుకున్నారు. 4th క్లాసులో ఉన్నపుడు వారికి చిన్న గొడవ జరిగి సద్దుమణిగింది. అనంతరం వారు పాఠశాల నుంచి విడిపోయారు.
ఇటీవల బాలకృష్ణన్ తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళినపుడు వీజే బాబు కలిశాడు. మాటల మధ్యలో చిన్ననాటి గొడవ ప్రస్తావన రాగా.. తనను ఎందుకు కొట్టావని బాలకృష్ణన్ బాబును అడిగాడు. అంతటితో ఆగక బాబు మీద తీవ్రంగా దాడికి దిగాడు. దీంతో బాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలకృష్ణన్ తోపాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.






