Sukma: సుక్మా జిల్లాలో భీకర ఎదురుకాల్పులు.. ఎర్రబోర్ ప్రాంతంలో ఉద్రిక్తత

by Ramesh Naini |

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Sukma: సుక్మా జిల్లాలో భీకర ఎదురుకాల్పులు.. ఎర్రబోర్ ప్రాంతంలో ఉద్రిక్తత
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎర్రబోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

సెర్చ్‌లో భాగంగా ఎర్రబోర్ అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులను ముట్టడించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆపరేషన్ కొనసాగుతున్న కారణంగా కాల్పులు జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, పాల్గొన్న బలగాల సంఖ్య వంటి కీలక వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. ఆపరేషన్‌లో పాల్గొంటున్న జవాన్ల భద్రత దృష్ట్యా ఈ వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ముట్టడికి సంబంధించిన సంపూర్ణ వివరణాత్మక నివేదికను అధికారికంగా విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Next Story