Fertility Rate : సంతానోత్పత్తి రేటు 2.0ను సాధించగలిగాం.. రాజ్యసభలో కేంద్రం వెల్లడి

by vinod kumar |
Fertility Rate : సంతానోత్పత్తి రేటు 2.0ను సాధించగలిగాం.. రాజ్యసభలో కేంద్రం వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) ప్రకారం సంతానోత్పత్తి రేటు (Fertility Rate) 2.0ను భారత్ సాధించిందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇది నేషనల్ పాపులేషన్ పాలసీ (National population Policy) -2000, నేషనల్ హెల్త్ పాలసీ (National healthy Policy) 2017కు అనుగుణంగా ఉందని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ (Anupriya patel) రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను కూడా పేర్కొన్నారు. గర్భనిరోధకాలు, కుటుంబ నియంత్రణ సేవలకు ప్రాధాన్యతను మెరుగు పర్చడానికి ఏడు హై ఫోకస్‌డ్ రాష్ట్రాలు, ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో మిషన్ పరివార్ వికాస్ అమలు చేసినట్టు పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ, సేవల పంపిణీపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచారం, వాసెక్టమీ ఫోర్ట్‌నైట్ ప్రతి ఏటా అన్ని రాష్ట్రాల్లో పాటిస్తున్నట్టు తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (FP-LMIS) అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అమలులో ఉందని వెల్లడించారు.

Next Story

Most Viewed