- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fertility: భారత్‌లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ఐరాస ఆందోళన
భారత్‌లో జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక నివేదికను వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఇండియా పాపులేషన్ పై కీలక నివేదికను వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశ జనాభా1.46 బిలియన్లకు చేరుకుంటుందని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుందని అంచనా వేసింది. అయితే దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రస్తుత రిప్లేస్‌మెంట్ రేటు కంటే తక్కువగా ఉందని తెలిపింది. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ ఆక్టివిటీస్ (యూఎన్ఎఫ్‌పీఏ) అనుబంధ సంస్థ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (SOWP) ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుత దేశ జనాభా 1,463.39గా అంచనా వేసింది. రాబోయే దశాబ్దంలో ఈ సంఖ్య 1.7 బిలియన్లకు పెరిగే చాన్స్ ఉందని పేర్కొంది. అంతేగాక 40 ఏళ్ల తర్వాత దేశంలో జనాభా తగ్గడం ప్రారంభమవుతుందని వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఆయుర్ధాయం పురుషులకు 71, మహిళలకు 74గా ప్రతిపాదించింది.
లక్షలాది మంది ప్రజలు తమ వాస్తవ సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని నివేదిక తెలిపింది. భారతదేశ సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి 1.9 జననాలకు తగ్గిందని, ఇది భర్తీ స్థాయి 2.1 కంటే తక్కువ అని పేర్కొంది. 1960లో భారతదేశ జనాభా దాదాపు 436 మిలియన్లు ఉన్నప్పుడు, సగటు స్త్రీకి దాదాపు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అలాగే1970లోనూ భారతీయ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు ఐదుగురు పిల్లలుగా ఉంది. కానీ ప్రస్తుతం భారత మహిళలు ఇద్దరు పిల్లలకే జన్మనిస్తుండటం గమనార్హం. జనాభా తగ్గుదల లేదా పెరుగుదల సంక్షోభం కాదని, సంతానోత్పత్తి తగ్గడమే నిజమైన సంక్షోభమని నివేదికలో పేర్కొంది. అయితే తగ్గుతున్న సంతానోత్పత్తిపై భయపడకుండా దాని లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది.
యువ జనాభానే అధికం
జనన రేటులో తగ్గుదల ఉన్నప్పటికీ దేశ యువ జనాభా గణనీయంగా ఉంది. 0 నుంచి14 సంవత్సరాల వయస్సు వారు 24 శాతం, 10 నుంచి19 ఏళ్ల వయస్సులో 17 శాతం, 10 నుంచి 24 ఏళ్ల వారు 26 శాతం ఉన్నారు. దేశ జనాభాలో 68 శాతం మంది పని చేసే వయస్సు 15 నుంచి 64 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు. ఇక వృద్ధుల జనాభా (65 కంటే ఎక్కువ వయసున్న వారు) ప్రస్తుతం ఏడు శాతం ఉన్నారు. ఆయుర్దాయం మెరుగుపడటంతో రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది.






