- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: భారత వైమానిక దాడులు గుర్తించేందుకు పాక్ చర్యలు
పహెల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. భారత సైన్యం నియంత్రణ రేఖ (LoC) వెంబడి అనేక చర్యలు తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. భారత సైన్యం నియంత్రణ రేఖ (LoC) వెంబడి అనేక చర్యలు తీసుకుంది. అయితే, భారత వైమానిక దాడులను గుర్తించడానికి పాకిస్థాన్ సైన్యం సియాల్‌కోట్ సెక్టార్‌లోని ప్రదేశాలకు తన రాడార్ వ్యవస్థలను తరలిస్తోంది. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న భారత్ సైన్యం కదలికలను గుర్తించడానికి పాక్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డిటాచ్‌మెంట్‌లను కూడా మోహరిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 58 కి.మీ. దూరంలో ఉన్న ఖోర్ కంటోన్‌మెంట్ వద్ద టీపీఎస్-77 రాడార్ సైట్‌ను ఏర్పాటుచేసింది. టీపీఎస్-77 మల్టీ-రోల్ రాడార్ (MRR) అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తారు. మరోవైపు, పీవోకే(POK) వ్యాప్తంగా పాక్ సైన్యం అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయడం ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తోందని పేర్కొన్నాయి.
వరుసగా ఐదో రోజు కాల్పులు..
మరోవైపు, నియంత్రణ రేఖ వెంబడి (LOC) దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత వరుసగా ఐదో రోజు కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సోమవారం రాత్రి అక్నూర్ సెక్టార్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని సరిహద్దుల్లో భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ తుపాకులతో విరుకుపడింది. అయితే పాక్ దుశ్చర్యను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ సైనికులకు దీటుగా భారత బలగాలు స్పందించాయని అధికారులు వెల్లడించారు.






