- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
POK : యుద్ధ భయం.. వాటిని భారీగా నిల్వ చేస్తున్న పాక్
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకొని.. యుద్ధానికి రెడీ అయ్యాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని ముజఫరాబాద్ లో భారీగా తిండి గింజలను నిల్వ చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఒకసారి యుద్ధం మొదలయ్యాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని దాదాపు 3 నెలలకు సరిపడా ఆహారాధాన్యాలను నిల్వ చేసుకోవాలని పాక్ సర్కార్ ప్రజలకు సూచించింది. కాగా ప్రజలు భారీగా తిండి గింజలను నిల్వ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో 1000కి పైగా మదర్సాలను అధికారులు మూసి వేశారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిరోజు కేంద్ర హోంశాఖతో, రక్షణశాఖతో, త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇరుదేశాల సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించాయి ప్రభుత్వాలు. వెరసి.. యుద్ధం తప్పదనే సంకేతాలు ఇరు దేశాల ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.






