Father: ఐదేళ్ల చిన్నారిని నాలుగు ముక్కలుగా నరికిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by B.Srinivas |

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఐదేళ్ల కుమార్తెను నాలుగు ముక్కలుగా నరికి చంపేశాడు.

Father: ఐదేళ్ల చిన్నారిని నాలుగు ముక్కలుగా నరికిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ (Utharapradesh)లోని సీతాపూర్ (Sithapur) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఐదేళ్ల కుమార్తెను నాలుగు ముక్కలుగా నరికి చంపేశాడు. గత నెల 25న జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాపూర్‌కు చెందిన మోహిత్ మిశ్రాకు, తన ఇంటి పక్కనే ఉన్న ఓ ఫ్యామిలీకి కొద్ది రోజులుగా తగాదాలు ఉన్నాయి. అయితే మోహిత్‌ కూతురు(5) పదే పదే ఆడుకోవడానికి వారి ఇంటికి వెళ్తోంది. దీంతో అక్కడికి వెళ్లొద్దని చాలాసార్లు మోహిత్ తన కూతురికి చెప్పాడు. అయినప్పటికీ వారింటికి వెళ్తూనే ఉండటంతో ఆగ్రహానికి గురైన మిశ్రా ఫిబ్రవరి 25వ తేదీన కూతురిని ఓ బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు.

అనంతరం శరీర భాగాలను నాలుగు ముక్కలుగా నరికి ఓ తోటలో పారేశాడు. ఆ తర్వాత తన కూతురు కనిపించడం లేదని స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి విచారించారు. మొదట చిన్నారి శరీర భాగాన్ని గుర్తించిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి చిన్నారి తండ్రిని విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story