Shraddha Walker: అస్థికల కోసం పోరాడుతూనే శ్రద్ధా వాకర్ తండ్రి మృతి

by Shamantha N |
Shraddha Walker: అస్థికల కోసం పోరాడుతూనే శ్రద్ధా వాకర్ తండ్రి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్(Shraddha Walker) హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం ఢిల్లీలో శ్రద్ధా బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు ముక్కులగా నరికి ఢిల్లీ శివారులో పారేశాడు. అయితే, శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ ముంబైలోని వాసాయి ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. తన కుమార్తె మరణానికి న్యాయం చేయాలని వేడుకున్న ఆయన మరణించడం విషాదంగా మారింది. అయితే, శ్రద్ధా హత్య తర్వాత నుంచి.. ఇప్పటికీ ఆయన షాక్‌లోనే ఉన్నారని సన్నిహితులు చెప్పారు. నిజానికి శ్రద్ధా వాకర్ కనిపించడం లేదని వికాస్ వాకర్ చేసిన ఫిర్యాదు ద్వారానే ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ కూతురి అస్థికలను దహానం చేయాలనుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. కానీ, చాలా కాలంగా కోర్టులో కేసు విచారణలో ఉండటం వల్ల సాధ్యం కాలేదన్నారు. శ్రద్ధా అస్థికలు దొరకకపోవడంతో ఆయన నిరాశకు గురయినట్లు చెప్పుకొచ్చారు.

అసలేం జరిగిందంటే?

ఇకపోతే, 18 మే 2022న జరిగిన ఈ సంఘటన దేశాన్ని కుదిపేసింది. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత అంటే నవంబర్‌లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె శరీరాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, ముక్కలుగా చేసి రోజుల తరబడి అటవీ ప్రాంతంలో పారేశాడు. ప్రస్తుతం నిందితుడు అఫ్తాబ్ ఢిల్లీ జైలులో ఉన్నారు. ఇప్పటికీ, అతడికి ఎలాంటి శిక్ష పడలేదు. అయితే, శ్రద్ధా తండ్రి తన కూతురి అస్థికల కోరుతూనే ఉన్నారు. కానీ, అతడు మరణించే వరుక అవి అందలేదు.

Next Story

Most Viewed