- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking: కన్న తండ్రే కాలయముడై..! ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Father kills three daughter) తమిళనాడులోని నమక్కల్ (Namakkal District) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడై తన ముగ్గురు కూతుళ్లను కత్తితో చంపి.. ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ సంఘటన కలకలం రేపుతోంది. భార్య, కొడుకును గదిలో బంధించి తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. నమక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన గోవింద రాజు (36).. ఇల్లు కట్టుకోవడానికి పెద్ద మొత్తంలో అప్పు చేశాడు. పెరుగుతున్న అప్పులు.. దాన్ని తిరిగి చెల్లించలేక అతను తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.
సోమవారం రాత్రి భోజనం తర్వాత తన భార్య భారతి (26), వారి ఏడాది వయసున్న కొడుకు అనిశ్వరన్ బెడ్‌రూమ్‌లో నిద్రపోగా, గోవిందరాజు, అతని ముగ్గురు కుమర్తెలు హాలులో పడుకున్నారు. తెల్లవారుజామున తన భార్య, కుమారుడు బయటకు రాకుండా బెడ్‌రూమ్ గదికి తాళం వేసి బంధించాడు. అనంతరం ముగ్గురు కూతుళ్లు ప్రతీష శ్రీ (9), రితిక శ్రీ (7), దేవిశ్రీ (3)లను పదునైన కొడవలితో గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ చర్యకు పాల్పడిన తర్వాత ఆపై అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కూతుళ్లను తండ్రి హత్య చేసే సమయంలో వారి అరుపులు విన్న తల్లి భారతి గదికి తాళం వేయడంతో గట్టిగా కేకలు వేసింది. చుట్టూ పక్కల వారు పరిగెత్తుకొని వచ్చి సరికి అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న పిల్లలను చూసి షాక్ అయ్యారు. ఇంకా గొవిందరాజు కూడా చనిపోయి ఉన్నట్లు స్థానికుల సమాచారం. సమాచారం అందిన పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల కారణంగా గోవిందరాజు ఈ దారుణమైన చర్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆయనకు దాదాపు రూ.20 లక్షల అప్పు ఉన్నట్లు అంచనా వేశారు.






