కోడలును రేప్ చేసిన మామ.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

సమాజంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సవతి తల్లితో పారిపోయిన కొడుకు.. అమ్మమ్మను రేప్ చేసిన మనవడు వంటి ఘటనలు మరవకముందే తాజాగా కోడలును మామ రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

కోడలును రేప్ చేసిన మామ.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సవతి తల్లితో పారిపోయిన కొడుకు.. అమ్మమ్మను రేప్ చేసిన మనవడు వంటి ఘటనలు మరవకముందే తాజాగా కోడలును మామ రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇండోర్‌కు చెందిన ఓ యువకుడు నాగ్దాకు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కోర్టులో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ మతం గురించిన గొడవలతో ఇంటి నుంచి అమ్మాయిని గెంటేశారు. అయితే పిల్లలను చూసేందుకు మళ్లీ వచ్చిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు మామ. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని బాధితురాలు మీడియా ముందుకు వచ్చి వివరించింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

VIDEO

Next Story