Bengaluru stampede: రూ.100 కోట్ల ఆస్తి పెట్టాను లేచిరా బిడ్డా..తొక్కిసలాటలో మరణించిన యువకుడి తండ్రి ఆవేదన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-08 14:46:14  IST  )

బెంగుళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న 11 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చినిపోయిన‌వాళ్లంతా చేతికొచ్చిన యువ‌త కావ‌డంతో ఆ కుటుంబాలు ఎంతో ఆవేద‌న చెందుతున్నాయి

Bengaluru stampede: రూ.100 కోట్ల ఆస్తి పెట్టాను లేచిరా బిడ్డా..తొక్కిసలాటలో మరణించిన యువకుడి తండ్రి ఆవేదన
X

దిశ‌, వెబ్ డెస్క్: బెంగుళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న 11 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చినిపోయిన‌వాళ్లంతా చేతికొచ్చిన యువ‌త కావ‌డంతో ఆ కుటుంబాలు ఎంతో ఆవేద‌న చెందుతున్నాయి. చినిపోయిన‌వారిలో చిన్నారులు కూడా ఉండ‌టం మరింత బాధాక‌రం. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం, ఆర్సీబీ జ‌ట్టు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించినా ఆ డ‌బ్బులు త‌మ క‌న్న‌బిడ్డ‌లను తీసుకురావు కాబ‌ట్టి త‌ల్లిదండ్రులు గుండెలు ప‌గిలేలా ఏడుస్తున్నారు.

తాజాగా బెంగుళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో చనిపోయిన 20ఏళ్ల యువ‌కుడు భూమిక్ తండ్రి ఏడుస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. నేను ఎక్కడికీ వెళ్లను..నా కొడుకు దగ్గరే ఉంటాను. వంద కోట్ల ఆస్తి పెట్టాను లేచిరా బిడ్డా... అంటూ అతడు రోదిస్తున్నాడు. కొడుకు స‌మాధి ప‌క్క‌న కూర్చుని ఆ తండ్రి త‌ల ప‌ట్టుకుని ఏడుస్తుంటే వీడియో చూస్తున్న‌వాళ్ల‌కు సైతం క‌న్నీళ్లు వ‌చ్చేలా ఉన్నాయి. వీడియో వైర‌ల్ అవుతుండ‌గా నెటిజన్లు అత‌డి బాధ చూసి ఇలాంటి క‌ష్టం ఏ తండ్రికి రాకూడ‌దు అని కామెంట్ చేస్తున్నారు. హీరోలు, క్రికెట‌ర్లు బానే ఉంటార‌ని యువ‌త వారి మోజులో ప్రాణాల‌ను కోల్పోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

https://x.com/ashuvemulapalli/status/1931559914562093488

Next Story