- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో దారుణం : దంపతులను వేధించి.. కొడుకును నగ్నంగా మార్చి..
ఢిల్లీలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ కుటుంబంపై దాడి చేసి, వారి కుమారుడిని నగ్నంగా మార్చి వీధుల్లో తిప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని లక్ష్మీనగర్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. వ్యాపారంలో విభేదాలు రావడంతో ఓ జిమ్ యజమాని కుటుంబంపై కొందరు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు మహిళ పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో జాతీయ మీడియాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. భర్తను కొట్టి తనను లైంగికంగా వేధించినట్లు బాధిత మహిళ పేర్కొంది. తమ కుమారుడిని నగ్నంగా మార్చి వీధిలోకి తీసుకెళ్లి దాడి చేశారని తెలిపింది.
దుర్బుద్ధితో దాడి
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్ గార్గ్, అతని భార్య తాము నివాసం ఉంటున్న ఇంటి బేస్ మెంట్లోనే ఒక జిమ్ ను రన్ చేస్తున్నారు. ఆ జిమ్ లో సతీశ్ యాదవ్ కేర్ టేకర్ గా పనిచేస్తున్నాడు. ఇంతలోనే అతనికి దుర్భుద్ధి పుట్టింది. జిమ్ ను అక్రమంగా చేజిక్కించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే జనవరి 2న బేస్ మెంట్ లో వాటర్ లీకేజీని టెస్ట్ చేసేందుకు తామిద్దరం వెళ్లగా.. సతీశ్ యాదవ్ కొందరు వ్యక్తులతో వచ్చి తమపై దాడిచేసినట్లు దంపతులు తెలిపారు. కింపడేసి ఇష్టానికి కొట్టారని, తన భార్య జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి వేధించారని రాజేశ్ గార్గ్ వాపోయాడు. ఇంతలో తమను కాపాడేందుకు కుమారుడు అక్కడికి రావడంతో అతనిపైనా దాడి చేసి, నడిరోడ్డుపై బట్టలు విప్పి ఇనుపరాడ్లతో కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి తలకు గాయాలవ్వగా ఒక పన్ను కూడా విరిగిపోయింది. రాజేశ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సతీశ్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులైన వికాస్ యాదవ్, శుభమ్ యాదవ్, ఓంకార్ యాదవ్ లు పరారీలో ఉన్నారని, వారికోసం వెతుకుతున్నామని తెలిపారు.






