- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FATF: నిధులు లేకుండా ఉగ్రదాడి సాధ్యం కాదు.. పహెల్గాం దాడిని ఖండించిన ఎఫ్ఏటీఎఫ్
ఉగ్రవాదులకు వారి మద్దతుదారుల నుంచి నిధులు లేకుండా టెర్రరిస్ట్ అటాక్స్ జరగలేవని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదులకు వారి మద్దతుదారుల నుంచి నిధులు లేకుండా పహెల్గాం దాడి సహా ఇతర టెర్రరిస్ట్ అటాక్స్ జరగలేవని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఉగ్రదాడులు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలిగొంటాయి. కొంత మందిని తీవ్రంగా గాయపరుస్తాయి. తీవ్రమైన భయనక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారు, వారి మద్దతు దారుల ప్రమేయం లేకుండా టెర్రరిస్ట్ దాడులు జరగవు’ అని తెలిపింది.
ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఒక విధానాన్ని రూపొందిస్తామని తెలిపింది. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా పౌరులకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రనిధులను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలపై ఎఫ్ఏటీఎఫ్ దృష్టి సారించిందని పేర్కొంది. కాగా, పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిరంతర మద్దతు ఇస్తోందని, ఆయుధాల కొనుగోలు కోసం వారికి నిధులను అందజేస్తోందని భారత్ ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఎఫ్ఏటీఎఫ్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.






