- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రైలు ప్రమాదం.. 18 మంది మృతి
మెక్సికో దక్షిణ భాగంలోని ఓక్సాకా రాష్ట్రంలో నిన్న ఇంటర్‌ఓషియానిక్ రైలు ఘోర ప్రమాదానికి గురైంది.

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికో దక్షిణ భాగంలోని ఓక్సాకా రాష్ట్రంలో నిన్న ఇంటర్‌ఓషియానిక్ రైలు ఘోర ప్రమాదానికి గురైంది. ఓక్సాకా–వెరాక్రూజ్ మధ్య ఉన్న లైన్ Zలో, అసున్సియాన్ ఇక్స్టాల్టెపెక్ ప్రాంతంలోని నిజాండా సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ఈ రైలులో సుమారు 241 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది కలిపి మొత్తం 250 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 98 మంది గాయపడగా, వారిలో 36 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మలుపు వద్ద రైలు అధిక వేగంతో వెళ్లడంతో ప్రధాన లోకోమోటివ్ పట్టాలు తప్పి సుమారు 7 మీటర్ల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ రైలు పసిఫిక్ మహాసముద్రంలోని సాలినా క్రూజ్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని కోట్జాకోల్కోస్‌తో కలుపుతుంది. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, ఓక్సాకా గవర్నర్ సాలోమన్ జారా క్రూజ్ మెక్సికో ఎవరా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. నేవీ, ఆర్మీ, సివిల్ ప్రొటెక్షన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం (FGR) దర్యాప్తు ప్రారంభించింది.






