- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర బస్సు ప్రమాదం.. 20కి చేరిన మృతుల సంఖ్య
by Muthe.Rajitha |
కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. రాత్రి 2 గంటల సమయంలో హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ చిత్రదుర్గ జిల్లా గోర్లతు వద్ద అదుపుతప్పి రోడ్డుకు అటుపక్కగా బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సు, లారీ రెండూ కాలి బూడిద అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రులకు తరలించారు. కాగా ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. బస్సులో అంతా గాఢ నిద్రలో ఉండటంతో వారంతా నిద్రలోనే సజీవ దహనం అయ్యారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






