ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఘోర ప్రమాదం.. కూలిపోయిన హెలికాఫ్టర్

by Muthe.Rajitha |

ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం, ట్రెక్కర్స్ కలల పర్వతం అయిన మౌంట్ ఎవరెస్టు వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఘోర ప్రమాదం.. కూలిపోయిన హెలికాఫ్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం, ట్రెక్కర్స్ కలల పర్వతం అయిన మౌంట్ ఎవరెస్టు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నేపాల్ వైపు ఎవరెస్టు శిక్షరం వద్ద తీవ్రంగా మంచు కురుస్తుండగా.. అక్కడ చిక్కుకుపోయిన ట్రెక్కర్లను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్‌పై ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ జారిపడి లోబుచేలో కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గురించి సమాచారం తెలియలేదు.

Next Story