- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో ఘోర ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై గ్యాప్‌లో చిక్కుకున్న కారు.. ఎలా జరిగిందంటే?
జాతీయ రహదారి 66 పై ఉన్న ఫ్లై ఓవర్ ఎక్కి మధ్యలో ఉన్న గ్యాప్‌లో కారు చిక్కుకుపోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 66 పై నిర్మాణం పూర్తి కాని ఫ్లై ఓవర్ ఎక్కి మధ్యలో ఉన్న గ్యాప్‌లో కారు చిక్కుకుపోయింది. కన్నూర్ జిల్లా తలస్సేరి-కన్నూర్ మార్గంలో నిర్మాణం పూర్తికాని ఫ్లైఓవర్‌పైకి ఎక్కిన కారు మధ్యలో ఉన్న పెద్ద గ్యాప్‌లో పడిపోయింది. ఈ ఘటనలో కారు కొంతసేపు గాల్లోకి వేలాడగా, అక్కడికి చేరుకున్న స్థానికుల సహాయంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తలస్సేరి నుంచి కన్నూర్ దిశగా వెళ్తున్న కారు, హెచ్చరిక బారికేడ్లను దాటేసి, నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి వెళ్లింది. ఫ్లైఓవర్ రెండు సెక్షన్ల మధ్య పనులు పూర్తికాకపోవడంతో మధ్యలొ ఉన్న గ్యాప్‌లోకి కారు జారిపోయింది. ఈ క్రమంలోనే కారు బ్రిడ్జిపై నుంచి కిందకు వేళాడుతున్నట్లు కనిపింది. డ్రైవర్ బారికేడ్లను గమనించకపోవడంతో ఫ్లైఓవర్‌పైకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్ వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టి కారును కిందకు జారకుండా నియంత్రించారు. ఈ ఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిర్మాణ ప్రదేశాల్లో స్పష్టమైన బోర్డులు, రిఫ్లెక్టివ్ మార్కర్లు, బలమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఇదే..






