- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Toll plaza: ఝాన్సీలో ఘోర ప్రమాదం.. టోల్ ప్లాజా వద్ద బీభత్సం సృష్టించిన ట్రక్కు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తాజాగా వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ హైవేలోని సెమ్రీ టోల్ ప్లాజా వద్ద అతివేగంతో దూసుకొచ్చిన ఒక ట్రక్కు, అక్కడ ఆగి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టోల్ ప్లాజా ఉద్యోగితో పాటు కారులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధంచిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో టోల్ ప్లాజా వద్ద రెండు కార్లు వరుసలో ఆగి ఉన్నాయి. ఫాస్టాగ్ (FASTag) స్కానర్ సరిగ్గా పనిచేయకపోవడంతో, 56 ఏళ్ల టోల్ ఉద్యోగి రామకాంత్ రిచారియా మాన్యువల్‌గా స్కాన్ చేయడానికి కారు వద్దకు వచ్చారు. అదే సమయంలో వెనుక నుంచి నియంత్రణ కోల్పోయిన ఒక ట్రక్కు అత్యంత వేగంతో వచ్చి కార్లను ఢీకొట్టింది.
50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ట్రక్కు
ప్రమాద తీవ్రతకు రామకాంత్ గాల్లోకి ఎగిరి ఒక కారు బానెట్‌పై పడ్డారు. ట్రక్కు వేగం తగ్గకపోవడంతో, ఆ రెండు కార్లతో పాటు ఉద్యోగిని కూడా సుమారు 50 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుపోయింది. ఈ భీకర దృశ్యాలన్నీ టోల్ ప్లాజా వద్ద ఉన్న సిసిటివి (CCTV) కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి ఇతర సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రామకాంత్‌ను వెంటనే మోత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. బాధితుడు జలౌన్ జిల్లా ఉరై నివాసిగా గుర్తించారు. కార్లలో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాలవగా, వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మోత్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






