- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీ ఆరుగురు మృతి
ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందారు. ఫిరోజాబాద్‌లో బుధవారం ఉదయం నాలుగు గంటల సమయంలో 50 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు లూధియానా నుండి రాయ్ బరేలీ వెళ్తోంది. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు మరణించగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలో ఉన్న సైఫై మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Also Read....
Next Story






