- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fastag: రూ. 3000కే ఏడాదంతా ప్రయాణం.. త్వరలోనే కొత్త ఫాస్టాగ్ పాలసీ
నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త ఫాస్టాగ్ పాలసీ (Fastag Policy) ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని రహదారులపై ప్రతి సారి టోల్ టాక్స్ చెల్లించాల్సిన పని లేకుండా ఏడాదికి ఒకే సారి చెల్లించేలా విధానాలు రూపొందించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎటువంటి అంతరాయం లేని ప్రయాణాన్ని అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. దీనిపై ఇప్పటికే ముసాయిదా రూపొందించినట్టు వెల్లడించాయి. ఈ ముసాయిదా ప్రతిపాదనలో వాహనదారులు కేవలం రూ.3000 చెల్లించి ఏడాదంతా జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేలపై అపరిమితంగా ప్రయాణించే అవకాశం కల్పించనుంది. ఈ వార్షిక పాస్‌తో దేశ వ్యాప్తంగా జర్నీకి అవకాశం ఇవ్వనుంది. ప్రస్తుతం రూ.3000 వార్షిక ప్లాన్ మాత్రమే గాక అత్యధిక దూరం ప్రయాణించాలంటే 100 కిలోమీటర్ల దూరానికి రూ. 50 చెల్లిస్తే సరిపోయేలా మరో ప్లాన్ సైతం ఉండనుంది.






