వాళ్లు ముస్లీంలే కాద‌ని నేను భావిస్తున్నా..జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |

జ‌మ్మూ క‌శ్మీర్ (Jammu kashmir) మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లా (Farook abdullah) ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన

వాళ్లు ముస్లీంలే కాద‌ని నేను భావిస్తున్నా..జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ, వెబ్ డెస్క్: జ‌మ్మూ క‌శ్మీర్ (Jammu kashmir) మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లా (Farooq abdullah) ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన పోనీ రైడ్ స‌య్య‌ద్ ఆదిల్ షా(Sayyad adil shah) కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పాప‌పు కుండ ఇప్పుడు నిండిపోయింది అని ఉగ్ర‌వాదాన్ని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ ఉగ్ర‌వాదుల‌పై తీసుకునే ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు తమ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఉగ్రవాదాన్ని వెంటనే పూర్తిగా పెకిలించాలని చెప్పారు.

పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవాళ్లు నరకంలో కుళ్లిపోతారు అని మండిపడ్డారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 6రోజుల క్రితం పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కూతురు భర్త రక్తంలో తడిసిపోవడం చూసి తాము కూడా ఏడ్చామని అన్నారు. తాము కూడా ఆహారం తీసుకోలేదని, మానవత్వాన్ని హత్య చేసే రాక్షసులు ఇప్పటికీ ఉన్నారని తెలిపారు. వారు తమను తాము ముస్లీంలు అని చెప్పుకుంటారు కానీ వారు ముస్లీంలు కాదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ త్యాగాలు వృధా కావ‌ని,ప్ర‌తీకారం త‌ప్ప‌ద‌ని తాను వారిని హెచ్చ‌రిస్తున్న‌ట్టు తెలిపారు. 35ఏళ్లుగా ఉగ్ర‌వాదాన్ని చూస్తున్నామ‌ని, ఉగ్ర‌వాదం ఎప్ప‌టికీ గెవ‌లేదు మ‌రియు గెల‌వ‌దు అని స్ప‌ష్టం చేశారు.

Next Story