- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులకు రైతు సంఘం కండీషన్.. వారికి మాత్రమే ఓట్లు
డిసెంబరులో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని..

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబరులో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలొస్తే గానీ నాయకులు తమకు కనిపించరని భావించిన స్థానిక స్వతంత్ర రైతు సంఘం (KIFA) అభ్యర్థులకు ఒక షరతు విధించింది. రైతుల ఓట్లు కావాల్సిన అభ్యర్థులు తాము తయారు చేసిన అల్టిమేటంపై సంతకాలు చేయాలని కండీషన్ పెట్టింది. లేదంతా అంతా కలిసి ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు.
అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి క్రూరమృగాలు చొరబడి పంటలు, ప్రజలపై దాడులు చేస్తున్నాయని, వాటి నుంచి ఆత్మరక్షణ కోసమై ప్రతిదాడి చేసి చంపాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు రైతుల స్వీయ రక్షణ హక్కుకు మద్దతిస్తూ రూపొందించిన అఫిడవిట్ పై సంతకాలు చేయాలని రైతు సంఘం కోరుతోంది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లోని సెక్షన్ 11(2) ప్రకారం అటవీప్రాంతం బయట క్రూరమృగాలు, ఇతర జంతువులపై దాడి చేస్తే ప్రాణరక్షణలో భాగంగా వాటిని గాయపరిచినా, చంపినా ఎలాంటి శిక్ష పడదు. కానీ చట్టవిరుద్ధంగా వన్యప్రాణుల్ని వేటాడినా, చంపినా ఈ రక్షణ వర్తించదు. అందుకే రైతుసంఘం ఈ అఫిడవిట్ పై సంతకాలు చేయాలని డిమాండ్ చేస్తోంది.






