- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : ఈ రైతు బాధ చూస్తే గుండె తరుక్కు పోవాల్సిందే
ఆరుగాలం పండించిన పంట వానలో కొట్టుకుపోతుంటే, దానిని కాపాడుకోడానికి ఆ రైతు పడిన ఆరాటం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్ళు ఆగవు.

దిశ, వెబ్ డెస్క్ : ఆరుగాలం పండించిన పంట వానలో కొట్టుకుపోతుంటే, దానిని కాపాడుకోడానికి ఆ రైతు పడిన ఆరాటం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్ళు ఆగవు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాకు చెందిన రైతు గౌరవ్ పన్వర్ తన వేరుశెనగ పంటను అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు మార్కెట్‌లో తడవకుండా కవర్‌తో కప్పి ఒంటరిగా పోరాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుండెల్ని మెలిపెట్టే ఈ వీడియో చూసిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గౌరవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అతడు నష్టపోయిన పంటకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
చౌహాన్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి, వాషిమ్ కలెక్టర్‌తో మాట్లాడి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు గౌరవ్‌కు చెప్పారు. ఈ సంభాషణ వీడియోను చౌహాన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిలో గౌరవ్ తన పంట నష్టం గురించి బాధతో చెప్పడం, చౌహాన్ ఓదార్చడం కనిపిస్తుంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, గౌరవ్ కుటుంబం ఇబ్బంది పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు.






