- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
131 రోజుల తర్వాత దీక్ష విరమించిన జగ్జీత్ సింగ్ దల్లేవాల్
రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ (Jagjit Singh Dallewal)చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు.

దిశ, నేషనల్ బ్యూరో: రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ (Jagjit Singh Dallewal)చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో నిర్వహించిన 'కిసాన్ మహా పంచాయత్'లో నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు దల్లేవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మీరంతా ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని నన్ను కోరారు. ఈ ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు మీకు రుణపడి ఉంటాను. మీ మనోభావాలను నేను గౌరవిస్తూ.. మీ ఆదేశాలను పాటిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. దీక్ష విరమించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రణ్‌వీత్‌సింగ్ బిట్టు అభ్యర్థించిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రమంత్రుల అభ్యర్థన తర్వాత..
సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) కలిసి ఏర్పాటు చేసిన వేదికలో కీలక నేతగా ఉన్న దల్లేవాల్.. దేశంలోని అన్నదాతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 131 రోజులుగా ఆయన దీక్ష చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీతో పాటు పలు డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గతేడాది నవంబర్ 26న దల్లేవాల్ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జనవరిలో రైతులను చర్చలకు ఆహ్వానించడంతో దీక్ష చేపట్టిన స్థలంలోనే వైద్య సాయం తీసుకొనేందుకు ఆయన అంగీకరించారు. కానీ, తన నిరాహార దీక్షను మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో, శనివారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయని.. మే 4న ఉదయం 11గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దల్లేవాల్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.






