ఫేర్‌వెల్ పార్టీ.. రెచ్చిపోయిన అమ్మాయిలు, అబ్బాయిలు

by Jakkula.Mamatha |

విద్యార్థులు(Students) పది సంవత్సరాలు(ten Years) ఒకే స్కూల్లో(School) చదువుకుని అందరితో ఐక్యమత్యంగా ఉంటూ ఎంతో ఆనందమైన జీవితాన్ని(Beautiful Life) గడుపుతారు.

ఫేర్‌వెల్ పార్టీ.. రెచ్చిపోయిన అమ్మాయిలు, అబ్బాయిలు
X

దిశ,వెబ్‌డెస్క్: విద్యార్థులు(Students) పది సంవత్సరాలు(ten Years) ఒకే స్కూల్లో(School) చదువుకుని అందరితో ఐక్యమత్యంగా ఉంటూ ఎంతో ఆనందమైన జీవితాన్ని(Beautiful Life) గడుపుతారు. కుల మత బేధాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. కొన్ని కొన్ని సమయాల్లో గొడవలు పడిన మళ్లీ సారీ చెప్పుకొని ఒక్కటవుతారు. ఏదైమైన చిన్నానటి ఫ్రేండ్స్‌షిప్‌(Friendship)లో మంచి బాండింగ్ ఉంటుంది.

పదో తరగతి ముగింపు సమయంలో విద్యార్థులకు వీడ్కోలు(Farewell party) సమావేశం ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాలు ఎంతో ఆనందంగా తమ స్నేహితులతో ప్రయాణించి.. ఇప్పుడు విడిపోవాల్సి వస్తుందని ఎమోషనల్ అవుతారు. ఈ క్రమంలో తమ ఫ్రెండ్స్‌ని విడిచి వెళ్లాలంటే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ తరుణంలోనే టీచర్లతో సరదాగా గడిపిన ఆ క్షణాలను కూడా గుర్తు చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు, ఆటపాటలతో అలరిస్తారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, మెడల్స్‌ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఓ పాఠశాలలో అదే విధంగా పదో తరగతి విద్యార్థుల కోసం ఫెర్‌వెల్ పార్టీ నిర్వహించారు. కానీ.. ఆ విద్యార్థులు పార్టీలో బీభత్సం సృష్టించారు.

అసలు విషయంలోకి వెళితే.. అస్సాం(Assam) సిల్చార్‌(Silchar)లో పదో తరగతి(Tenth Class) విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ(Farewell party) నిర్వహించారు. ఈ క్రమంలో బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లిన విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో ఫర్నీచర్(Furniture), ఫ్యాన్లు(Fan), బల్బులు, బ్లాక్ బోర్డులు(Blackboard), ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అమ్మాయిలు సైతం అబ్బాయిలతో కలిసి రచ్చ చేశారు. ఈ ఘటన పై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Next Story