సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఇవాళ కమర్షియల్ గ్యాస్ (Commercial Gas) ధరలు భారీగా పెరగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్యులు వాడే వంట గ్యాస్ (LPG), పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పాత ధరలకే ఇంధనం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఇక గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలను పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచామని తెలిపారు. అయితే, దీని ప్రభావం కేవలం వ్యాపార వర్గాలకే పరిమితం అవుతుందని, సాధారణ గృహ వినియోగదారులపై దీని భారం పడదని అధికారులు తెలిపారు. కమర్షియల్ ధరలు పెరిగినప్పుడల్లా డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరుగుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 2 నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు అందుబాటులో కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Next Story