- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి కస్తూరి, ట్రాన్స్‌జెండర్ నమిత
తమిళనాడు బీజేపీ(Tamilnadu BJP)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బీజేపీ(Tamilnadu BJP)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటి కస్తూరి(Actress Kasturi), ట్రాన్స్‌జెండర్ కార్యకర్త నమిత మారిముత్తు(Namita Marimuthu) బీజేపీలో చేశారు. వారికి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కస్తూరి సీనియల్స్‌లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించింది. ఆమె నటనతో ప్రత్యేకతను చాటుకుంది. నిత్యం సోషల్ మీడియాలో ఆమెను లక్షల మంది ఫాలో అవుతుంటారు. మోడల్‌గానే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోని పలు సినిమాల్లోలోనూ తనదైన నటనతో మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా, పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతానికి కస్తూరి కృషి చేస్తుందని భావిస్తున్నట్లు నైనార్ నాగేంద్రన్ అభిప్రాయపడ్డారు.






