వృద్ధురాలిని రోడ్డుపక్కన పడేసిన కుటుంబం.. మరుసటి రోజే మరణం.. కన్నీళ్లు తెప్పిస్తున్న సీసీటీవీ రికార్డు

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-26 02:13:19  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని.. కుటుంబ సభ్యులు రాత్రి వీధిలో వదిలి వెళ్లిపోయారు. కిషున్ దాస్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో బాధపడుతూ,

వృద్ధురాలిని రోడ్డుపక్కన పడేసిన కుటుంబం.. మరుసటి రోజే మరణం.. కన్నీళ్లు తెప్పిస్తున్న సీసీటీవీ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని.. కుటుంబ సభ్యులు రాత్రి వీధిలో వదిలి వెళ్లిపోయారు. కిషున్ దాస్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో బాధపడుతూ, మెడపై తీవ్రమైన గాయంతో ఉన్న ఆమెను.. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఈ-రిక్షాలో వచ్చి రోడ్డు పక్కన వదిలివేసి వెళ్లిపోయారు. ఇది సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. మరుసటి రోజు ఉదయం ఆమె క్లిష్ట పరిస్థితిలో కనిపించింది. దీంతో దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి చికిత్స కోసం తరలించబడింది. అదే రోజు రాత్రి మరణించింది. పోలీసులు ఈ ఘటనను విచారిస్తున్నారు. కానీ చీకటి, దూరం కారణంగా వ్యక్తులను, ఈ-రిక్షాను గుర్తించడం కష్టంగా ఉంది.

Link

Next Story